యుద్దాన్ని కోరుకోవడం లేదు....అలాగని భయపడేది లేదు: చైనా

SMTV Desk 2019-06-03 16:25:51  america china trade war

బీజింగ్‌: అమెరికా మొదలు పెట్టిన వాణిజ్య యుద్దాన్ని మేము కోరుకోవడం లేదని, అలాగని దానికి భయపడేది లేదు అని చైనా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో శనివారం చైనా ఒక శ్వేత పత్రాన్ని విడుదలజేసింది. అమెరికా-చైనా మధ్య వాణిజ్య సంబంధాలు ద్వైపాక్షిక సంబంధాల మెరుగు దలకు, ఇరదేశాల ప్రజల మౌలిక ప్రయోజనాలు, సుస్థిరత, సౌభాగ్యానికి ఆలంబనగా నిలిచాయని ఆ శ్వేతపత్రం పేర్కొంది. వాణిజ్య యుద్ధం ద్వారా తమను లొంగదీసుకోవా లని అమెరికా భావిస్తోంది. సుంకాల యుద్ధం ద్వారా అమెరికా మరోసారి గొప్పగా ఎదగాలని చూస్తోందని చైనా ఆరోపిం చింది. ఈ వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కారం కోరుకుంటు న్నామని, మౌలిక సూత్రాలపై ఎటువంటి రాజీ పడబోమని చైనా ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇరుదేశాల మధ్య కొనసాగు తున్న వాణిజ్య యుద్ధానికి తెరదించేందుకు గత ఏడాది నుండి ఇప్పటి వరకు జరిగిన 11 విడతల చర్చల ప్రక్రియలో తాము అనుసరిస్తున్న వైఖరిపై చైనా ప్రభుత్వం ఈ శ్వేతపత్రంలో వివరించింది. అమెరికా చేపట్టిన సుంకాల పెంపుదల చర్యలు అమెరికా ఆర్థికాభివృద్ధిని ఏ మాత్రం మెరుగుపర్చక పోగా, ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన చేటు తెస్తున్నాయని చైనా ప్రభుత్వం ఈ పత్రంలో వివరించింది. చర్చల సందర్భంగా కుదిరిన కొన్ని ఒప్పందాల నుండి వెనుకంజ వేశారంటూ అమెరికా తమపై చేసిన ఆరోపణలను చైనా తిప్పికొట్టింది. ఈ శ్వేతపత్రాన్ని విడుదల చేసిన చైనా ఉప వాణిజ్య మంత్రి వాంగ్‌షోవెన్‌ మాట్లాడుతూ చైనా సార్వభౌమత్వంపై రాజీ పడాలంటూ అమెరికా ఒత్తిడి తెస్తోందని విమర్శించారు. తమతో కుదుర్చుకున్న ఒప్పందం అమలును పరిశీలించేందుకు తమకు అవకాశం కల్పించాలని, ముఖ్యంగా మేథోసంపత్తి హక్కులు (ఐపిఆర్‌), సాంకేతిక పరిజ్ఞానం బదిలీ వంటి అంశాలపై తమకు ప్రభుత్వ పరంగా హామీ కావాలని డిమాండ్‌ చేస్తోందని ఆయన వివరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేరును నేరుగా ప్రస్తావించని వాంగ్‌ తమపై వత్తిడి పెంచేందుకు అమెరికా తమ ఉత్పత్తులపై టారిఫ్‌లను పెంచటంతో ఈ చర్చల ప్రక్రియకు గట్టి ఎదురుదెబ్బ తగిలిం దని చెప్పారు. ఎదుటి వారి సార్వభౌమత్వాన్ని, కీలక ప్రయోజ నాలను గౌరవించకుండా వాటిపై రాజీ పడాలంటూ వత్తిడి పెంచి ప్రయోజనం పొందాలనుకుంటే అటువంటి చర్చలు ఎన్నటికీ ఫలప్రదం కాబోవని ఆయన స్పష్టం చేశారు.