కార్ల నెంబర్ ప్లేట్లపై ‘జై జగన్’!

SMTV Desk 2019-06-03 15:32:31  ys jagan mohan reddy name in vehicle number plates

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాజాగా భాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏ రేంజ్ లో పాపులారిటీ ఉందొ తెలిసిందే. ఏపీ కొత్త సీఎం గురించి సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు తెగ షేర్ అవుతున్నారు. జగన్ క్రేజ్‌ ఏ రేంజ్‌లో ఉందో ఇవి తెలియజేస్తున్నాయి. సాధారణంగా మనం కార్లపై నెంబర్ ప్లేటును గమనిస్తే.. అక్షరాలు, నెంబర్లు ఉంటాయి. కానీ కొన్ని కార్లపై ఎలాంటి నెంబర్లు లేవు. కేవలం జగన్ పేరు తప్ప. ‘ఏపీ సీఎం జగన్’ అనే పేరు కారు నెంబర్ ప్లేట్‌పై ఉంది. అంతేకాదండోయ్ ‘జై జగన్’ అనే నెంబర్ ప్లేటుతో కూడా కార్లు దర్శనమిచ్చాయి. వీటిని చూస్తే జగన్ అన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థమౌతోంది. హ్యుందాయ్, ఫోక్స్‌వ్యాగన్, మహీంద్రా వంటి కంపెనీలకు చెందిన కార్లపై ఏపీ సీఎం జగన్, జై జగన్ అనే నెంబర్ ప్లేటు ఉండటాన్ని ఫోటోలలో గమనించొచ్చు.