కిమ్‌ సంచలనం; ఐదుగురికి మరణశిక్ష

SMTV Desk 2019-06-01 12:30:57  kim joa um,

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఐదురుగు అధికారులకు మరణశిక్ష విధించి అమలు చేయించాడు. చట్టాలను, నిబంధనలను ఉల్లంఘిస్తే అది సామాన్యుడైనా, అధికారానై ఎవరైనా తనకు ఒక్కటేనని స్పష్టం చేశారు. ఐదుగురి అధికారులను కాల్చి చంపడానికి కారణం ఏంటంటే ఫిబ్రవరిలో కిమ్ జోంగ్ ఉన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ మధ్య రెండో సమావేశం ఎలాంటి ఫలితం లేకుండా ముగిసిన విషయం తెలిసిందే.

అయితే ట్రంప్‌తో భేటీ విఫలమైనందుకు ప్రధాన కారకులుగా భావిస్తూ ఐదుగురు ఉన్నతాధికారులను ఉత్తరకొరియా ప్రభుత్వం కాల్చి చంపారని దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ వార్తాపత్రిక ‘ది చూసన్ ఇల్బో’ ఒక కథనాన్ని ప్రచురించింది. ఫిబ్రవరి 27-28న వియత్నాం రాజధాని హనోయి వేదికగా ట్రంప్, కిమ్ రెండోసారి భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ చర్చల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో భేటీని అర్ధంతరంగా ముగించారు. ఈ సమావేశానికి గ్రౌండ్ వర్క్ చేసిన అమెరికాకు ఉత్తరకొరియా ప్రత్యేక రాయబారి కిమ్ హ్యోక్ చోల్‌ను ఈ ఏడాది మార్చిలో మిరిమ్ ఎయిర్‌పోర్టులో ఫైరింగ్ స్క్వాడ్ కాల్చి చంపినట్లు ఆ పత్రిక పేర్కొంది. ఆయనతో పాటు విదేశాంగ శాఖకు చెందిన నలుగురు సీనియర్ అధికారుల ప్రాణాలు తీసేసినట్లు తెలిపింది. దేశాధినేతను మోసం చేసిన ఆరోపణలతో వీరిని చంపినట్లు సమాచారం.