ఏషియన్ గాస్ట్రోలజి హాస్పిటల్‌కి ఏపీ మాజీ ముఖ్యమంత్రి

SMTV Desk 2019-06-01 11:58:17  Chandrababu,

ఏపీ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న అమరావతి నుంచి హైదరాబాద్‌కి చేరుకున్నారు. నిన్న సాయంత్రం హైదరాబాద్‌కి చేరుకున్న చంద్రబాబు నేడు ఉదయం గచ్చిబౌలి లోని ఏషియన్ గాస్ట్రోలజి హాస్పిటల్‌కి వెల్లాడు. అయితే ఆసుపత్రిలో చంద్రబాబు సుమారు గంటకు పైగా ఉన్నారు. డాక్టర్లు గంటకు పైగానే చంద్రబాబుకు మెడికల్ చెకప్‌ను నిర్వహించారు. అయితే చంద్రబాబు కేవలం తన వ్యక్తిగత సిబ్బందితో మాత్రమే ఆసుపత్రికి వెళ్ళారు.

అయితే ఆసుపత్రికి వెళ్ళే సమయంలో చంద్రబాబు కాస్త డల్‌గా కనిపించారట. అయితే ఎన్నికలలో తెలుగుదేశం చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఘోరంగా ఓటమి పాలవ్వడమే దీనికి కారణమట. ఎన్నికల్లో ఓటమి తరువాత పార్టీనీ ఎలా నిలబెట్టాలనే ఆలోచనలతో తనలో తానే బాగా క్రుంగిపోయారట. అయితే ఆసుపత్రి నుంచి నేరుగా చంద్రబాబు జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. అయితే కుటుంబసభ్యులతో కలిసి రెండు రోజుల పాటు చంద్రబాబు ఇక్కడే ఉంటున్నట్టు సమాచారం. చంద్రబాబు రాకను తెలుసుకున్న పలువురు సీనియర్ నాయకులు జేసీ దివాకర్ రెడ్డి, ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి చంద్రబాబుతో సమావేశమయ్యారు. అంతేకాదు రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ పరిణామాల గురించి పార్టీ బలోపేతం గురించి చర్చించినట్టు సమాచారం.