అబుదాబిలో భారత్‌కు అరుదైన గౌరవం

SMTV Desk 2019-05-31 15:33:48  Indian national flag in uae

అబుదాబి: భారత్ కు అబుదాబిలో అరుదైన గౌరవం దక్కింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండో సారి ప్రధానిగా భాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా ఆ దేశంలో ప్రఖ్యాత ఏడీఎన్‌ఓసీ టవర్లపై భారత్‌ మువ్వన్నెల జెండాతో పాటు ఆ దేశ జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. అంతేకాక ఆదేశ యువరాజు మహ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌తో మోడి కరచాలనం చేసిన చిత్రాన్ని కూడా అక్కడ ప్రదర్శించారు. అయితే ఈ అరుదైన ఘటనతో భారత్‌తో తమకున్న స్నేహబంధాన్ని అక్కడి ప్రభుత్వం చాటి చెప్పింది. దీనికి సంబంధించిన వీడియోను అక్కడి భారత రాయబారి నవదీప్ సింగ్‌ పూరి ట్విటర్‌లో పంచుకున్నారు. ఇలాంటి చర్యలతో ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే అవకాశం కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.