అమెరికా రాయబారి కిమ్ హ్యాక్ చోల్ ను హతమార్చిన ఉత్తరకొరియా

SMTV Desk 2019-05-31 15:32:07  North Korea envoy Kim Hyok Chol, america

అమెరికా ప్రత్యేక రాయబారిగా ఉన్న కిమ్ హ్యాక్ చోల్ ను ఉత్తరకొరియా హతమార్చింది.తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రాంప్ తో జరిగిన హ‌నోయి స‌మావేశం విఫ‌లం కావడం వల్లనే ఆ అధికారిని హతమార్చినట్లు తెలుస్తోంది. వాస్త‌వానికి ట్రంప్‌తో జ‌రిగిన హ‌నోయి స‌మావేశానికి గ్రౌండ్ ప్లాన్ చేసింది కిమ్ హ్యాక్ చోల్‌. కిమ్‌తో ప్రైవేటు రైలులో కూడా కిమ్ హ్యాక్ చోల్ ప్ర‌యాణించారు. అయితే సుప్రీం నేత అయిన కిమ్ జాంగ్ ఉన్ ఆదేశాల‌ను ఉల్లంఘించినందుకు కిమ్ హ్యాక్ చోల్‌ను ఫైరింగ్ స్క్వాడ్ హ‌త‌మార్చిన‌ట్లు తెలుస్తోంది. కాగా మార్చి నెల‌లో కిమ్ హ్యాక్ చోల్‌ను ఫైరింగ్ స్క్వాడ్ హ‌త‌మార్చిన‌ట్లు తెలుస్తోంది. ఓ ద‌ర్యాప్తు నివేదిక ఆధారంగా ఈ చ‌ర్య‌కు పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది.