స్ల్పెండర్ ప్లస్‌: మార్కెట్లోకి 25 ఏళ్ల స్పెషల్ ఎడిషన్ మోడల్‌

SMTV Desk 2019-05-31 12:44:39  splendor plus, Hero Splendor+ 25 Years Special Edition

ఫ్యామిలీ బైక్స్‌ అంటే ముందుగా గుర్తొచ్చేవి స్ల్పైండర్ మోటార్‌సైకిల్సే. 100 సీసీ విభాగంలో ఇప్పటికీ వీటిదే హవా. హీరో మోటొకార్ప్ స్ల్పెండర్ బ్రాండ్‌ను మార్కెట్‌లో లాంచ్ చేసి 25 ఏళ్లు కావొస్తోంది. కంపెనీ తొలిసారిగా 1994లో ఈ బైక్స్ తయారీని ప్రారంభించింది. హీరో హోండా సీడీ100, హీరో హోండా స్లీక్ వంటి మోడళ్ల స్థానాన్ని భర్తీ చేస్తూ ఇవి మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాయి. కంపెనీ 2004లో స్ల్పెండర్ బైక్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా స్ల్పెండర్ ప్లస్‌ను తీసుకువచ్చింది. మళ్లీ 2007లో లుక్ పరంగా కొన్ని స్వల్ప మార్పులతో కొత్త వెర్షన్ లాంచ్ చేసింది. 2011లో స్ల్పెండర్ ప్రో‌ బైక్ తెచ్చింది. చివరిగా 2014లో స్ల్పెండర్ ఐస్మార్ట్ బైక్‌ను తీసుకువచ్చింది. కంపెనీ తాజాగా స్ల్పెండర్ ప్లస్‌లో 25 ఏళ్ల స్పెషల్ ఎడిషన్ మోడల్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చేందుకు సిద్ధమౌతోంది. ఐకానిక్ స్ల్పైండర్ బ్రాండ్ లాంచ్ చేసి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా కంపెనీ ఈ బైక్‌ను తీసుకువస్తోంది. ఈ కొత్త బైక్ ధర రూ.55,856గా ఉంది. జంషెడ్‌పూర్ ఎక్స్‌షోరూమ్ ధర ఇది. స్ల్పెండర్ ప్లస్‌లో స్టాండర్డ్ వెర్షన్ ధర రూ.54,856గా ఉంది. స్పెషల్ ఎడిషన్ బైక్ ధర రూ.1,000 ఎక్కువ.ఆకర్షణీయమైన గ్రాఫిక్స్, 3డీ ఎంబ్లెమ్, స్పెషల్ ఎడిషన్ స్టిక్కర్ వంటి ప్రత్యేకతలున్నాయి. ఫ్యూయెల్ ట్యాంక్ పైన 3డీ హీరో లోగో ఉంటుంది. సైడ్ ప్యానెల్స్‌పై స్ల్పెండర్ ప్లస్ 25 ఇయర్స్ స్పెషన్ ఎడిషన్ స్టిక్కర్లు కనిపిస్తాయి. యూఎస్‌బీఐ చార్జర్ కూడా ఉంది. బైక్‌లో 97 సీసీ ఇంజిన్ ఉంటుంది.