భర్త వీడియోలను ట్రోల్ చేసిన భార్య....అది కాస్త కోర్టుకెళ్ళింది

SMTV Desk 2019-05-31 12:32:04  husband

భార్యాభర్తల మధ్య ఘర్షణకు చాలా కారణాలు ఉంటాయి. ఒక్కొసారి చిన్న చిన్న కారణాలకు కూడా భార్యపై చేయి చేసుకుంటుంటారు భర్తలు. తాజాగా ఇదే కొవలో జపాన్‌లో ఓ సంఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియా వేదికగా తనపై భార్య ట్రోలింగ్ చేయడం తట్టుకోలేని భర్త ఆమెను చావగొట్టాడు. ముష్టిఘాతాలతో భార్యపై విరుచుపడి తీవ్రంగా గాయపరిచాడు.

అసలేం జరిగిందంటే... ఇనొకుమాలో నివాసముండే దంపతుల మధ్య యూట్యూబ్ వీడియోల విషయమై మొదలైన గొడవ కోర్టు మెట్లు ఎక్కే వరకు వెళ్లింది. యూట్యూబ్‌లో వీడియోలు చేసి డబ్బు సంపాదించాలనేది భర్త ఆలోచన.

దీనికోసం అతడు ఓయిటాలోని రెస్టారెంట్లు, పర్యాటక ప్రాంతాలపై డాక్యుమెంటరీ తీసి యూట్యూబ్‌లో పెట్టాడు. వీడియో ఎక్కువ మందికి చెరితే వ్యూస్ పెరిగి డబ్బులు వస్తాయని ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో తన వీడియోలపై నెగెటివ్ కామెంట్స్ రావడం గమనించాడు. అవి ఎవరు పెడుతున్నారని వెతికాడు. తీర అవి తన భార్యతో పాటు ఆమె స్నేహితులు పెట్టినవి అని తెలుసుకున్నాడు.

దీంతో భార్య చేసిన పనికి కోపోద్రిక్తుడైన భర్త ఆమెపై విరుచుకుపడ్డాడు. భార్య ముఖం, కాళ్లపై కొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. దాంతో భర్తపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నెల 21న ఓయిటా డిస్ట్రిక్ కోర్టులో హాజరుపరిచారు. ఇరువురి వాదనలు విన్నా కోర్టు తుది తీర్పును జూన్ 6వ తేదీకి వాయిదా వేసింది.