బ్రెజిల్ బార్ లో కాల్పులు...11 మంది మృతి

SMTV Desk 2019-05-31 11:59:57  firing in bar, Brazil

బ్రెజిల్: బ్రెజిల్ లో దారుణం చోటుచేసుకుంది. పారా స్టేట్ లోని బెలిం సిటీలోని ఓ బార్ లో ఏడుగురు దుండగులు ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 11 మంది మరణించగా ఒకరు గాయపడ్డారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, అయిదుగురు పురుషులు ఉన్నారు. ముఖాలకు మాస్క్ లు ధరింఛి వచ్చిన దుండగులు ఈ దారుణానికి పాల్పడ్డారని, ఒకరిని పట్టుకోగలిగామని పోలీసులు తెలిపారు. ఈ దాడికి కారణాలు తెలియలేదు.