విజయవాడను హైసెక్యూరిటీ జోన్ గా ప్రకటించిన పోలీసులు

SMTV Desk 2019-05-30 16:02:32  ap cm

ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో విజయవాడ జనసంద్రంగా మారింది. రాష్ట్ర నలుమూలల నుంచి వైసీపీ అభిమానుల భారీ సంఖ్యలో నగరానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో, విజయవాడను హైసెక్యూరిటీ జోన్ గా పోలీసులు ప్రకటించారు. 5 వేల మంది పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. 13 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. ఈ సాయంత్రం వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. మధ్యాహ్నం 12.23 గంటలకు జగన్ చేత గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు.