మానిటరింగ్‌ లిస్ట్‌ నుంచి రూపాయి తొలగింపు: మోదీ సర్కార్ కు గుడ్ న్యూస్

SMTV Desk 2019-05-30 15:40:25  

వాషింగ్టన్‌: అమెరికాకు అనుకూలంగా భారత్‌ పలు చర్యలు తీసుకోవడంతో అమెరికా ప్రధాన వ్యాపార భాగస్వాముల కరెన్నీ మానిటరింగ్‌ లిస్ట్‌ భారత కరెన్సీ రూపాయిని తొలగించిన సంగతి తెలిసిందే. దీంతో మోదీ ప్రభుత్వానికి డొనాల్డ్ ట్రంప్ తీపి కబురు అందించినట్లు అయ్యింది. భారత్ ప్రభుత్వం పలు ప్రధాన సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యలు సహా పలు ఇతర పరిణామాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా స్పష్టం చేసింది. ఇండియాను కరెన్సీ పర్యవేక్షిత జాబితా నుంచి తొలగించామని అమెరికా ఆర్థిక శాఖ పేర్కొంది. భారత్ మూడు అర్హతల్లో ఒకదానిని సాధించిందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తన తాజా పాక్షిక వార్షిక నివేదికలో తెలిపింది. ఇకపోతే అమెరికా తొలిసారిగా భారత్‌ను 2018 మే నెలలో ఈ కరెన్సీ మానిటరింగ్ జాబితాలో చేర్చింది.