పన్నెండో రౌండ్ లో కూడా భారీ ఆధిక్యంలో టీడీపీ... వైసీపీ ప్రచారమే వారి ఓటమికి కారణం...

SMTV Desk 2017-08-28 12:25:29  TDP, YSRCP, Nandyala by-polls Results, By-Elections

నంద్యాల, ఆగస్ట్ 28: నంద్యాల ఉపఎన్నికల కౌంటింగ్ ప్రారంభం నుంచి దూసుకుపోతున్న అధికార పార్టీకి 10వ రౌండ్ పూర్తయ్యేసరికి ఉన్న19,657ఓట్ల ఆధిక్యంలో ఉంది. 12వ రౌండ్ పూర్తయ్యేసరికి 21841 ఓట్ల ఆధిక్యంగా మారింది. కాగా, టీడీపీ పదవ రౌండ్‌లో 1486 ఓట్లు, పదకొండవ రౌండ్‌లో 604 ఓట్ల మెజార్టీ సాధించింది . ఈ తరుణంలో ఇంకా వైసీపీ అభ్యర్థి గెలుపు నల్లేరు పై నడకలా మారిందని ఎన్నికల విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. వైసీపీ ఓటమి కారణం వారు చేసిన విమర్శలు, వారు వాడిన పదజాలం అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. నంద్యాల నియోజకవర్గం మొత్తం పసుపు వర్ణంతో నిండి, సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.