పేదలకు ఎంతో చేసిన నువ్వు ఓడిపోవడం ఏమిటయ్యా? ఇదంతా ఏదో మాయగా ఉందయ్యా!

SMTV Desk 2019-05-30 14:08:49  tdp

పేదలకు ఎంతో చేసిన నువ్వు ఓడిపోవడం ఏమిటయ్యా? ఎక్కడో ఏదో జరిగింది. ఇదంతా ఏదో మాయగా ఉందయ్యా. ఇది మేమిచ్చిన తీర్పు కాదు. మిషన్లు ఇచ్చిన తీర్పు. ఎప్పుడూ పని పని అని పరితపించే వాడిని ఓడించడం ఎక్కడైనా ఉందా? ఏదో మాయ జరిగిందయ్యా... ఇవి చంద్రబాబును కలిసేందుకు అమరావతికి వచ్చిన మహిళలు అంటున్న మాటలు.

తాజాగా జరిగిన ఎన్నికల్లో పార్టీ ఘోర పరాభవాన్ని తట్టుకోలేకపోతున్న పలువురు చంద్రబాబును కలిసి బోరుమంటున్నారు. ఎందరికో ఇళ్లు ఇచ్చినా, నెలవారీ పింఛన్లు ఇచ్చి వారిని ఆదుకున్నా, టీడీపీ ఓడిపోయిందంటే నమ్మలేకున్నామని, ఇదంతా ఏదో మాయగా ఉందని, ఇది తామిచ్చిన తీర్పు కాదని, మిషన్లు ఇచ్చిన తీర్పని వారు వాపోయారు. ఇక వారిని చూసి చలించిపోయినప్పటికీ, ఓదార్చే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు, మళ్లీ మంచి రోజులు వస్తాయని, అందరూ ధైర్యంగా వుండాలని, నిబ్బరంగా ఉండండని చెప్పి పంపుతున్నారు.