బ్లూ కలర్ టీషర్ట్, జీన్స్‌లో పవన్ కళ్యాణ్ .. ఆనందం లో డై హార్డ్ ఫాన్స్ ..

SMTV Desk 2019-05-30 13:44:34  pawan kalyan, blue shirt,

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లో మరీ ముఖ్యంగా ఎన్నికలు దగ్గర పడ్డాక తన వేషధారణలో మార్పులు చేశారు. అప్పటివరకు పవ‌న్‌‌లో పవర్ స్టార్‌‌ను చూసిన అభిమానులు అక్కడి నుంచి అచ్చమైన రాజకీయ నాయకుడిని చూశారు. తెలుపు రంగు కుర్తా పైజామా, పంచె కట్టులోనే పవన్ తన లుక్ కి పొలిటికల్ టచ్ ఇచ్చారు. కార్యకర్తలు, నేతలతో సమావేశాలకు వెళ్లినా, ప్రచారానికి వెళ్ళినా ఈ చేనేత దుస్తుల్లోనే వెళ్ళాడు. అయితే ఎన్నికల సీజన్ అయిపోవడంతో పాటు తనకు జనం పెద్ద షాక్ ఇవ్వడంతో ఆయన సైలంట్ అయ్యారు. ఇక తాజాగా అయన కొత్త లుక్‌లో కనిపించారు.

ఘోర పరాజయం తరవాత జనసేన కార్యచరణపై దృష్టిపెట్టిన పవన్ తన వస్త్రధారణను కూడా మార్చారు. పవన్ కళ్యాణ్ బ్లూ కలర్ టీషర్ట్, జీన్స్‌లో ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాపోతే గుబురు గెడ్డం ఇంకా అలానే ఉంచారు వపన్. మరో పక్క పవన్ మళ్లీ సినిమాల వైపు వచ్చే అవకాశం ఉందని వార్తలు మీద వార్తలు వస్తున్నాయి. పవన్‌ -బోయపాటి తో సినిమా చేయడానికి బండ్ల గణేశ్ ప్రయత్నిస్తున్నారని, ఆయన్ని ఒప్పించే పనిలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. దీని మీద స్పందించిన బండ్ల అదేమీ లేదని క్లారిటీ ఇచ్చాడు.