కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ..

SMTV Desk 2019-05-30 13:26:54  revanth reddy, ktr,

టీఆర్‌ఎస్ నేత కేటీఆర్‌కు ఎంపీ రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ప్రజల్లో టీఆర్ఎస్ పట్ల తిరస్కరణ మొదలైందని, వాస్తవాన్ని జీర్ణించుకోలేని మీరు కుంటి సాకులు చెబుతున్నారని ఆరోపించారు. ‘‘ఐదు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కాదు. ఐదేళ్ల క్రితం ఫలితాలతో పోల్చుకోవడం మీ అతి తెలివికి నిదర్శనం. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు 20 లక్షల ఓట్లు తగ్గిపోయాయి. సిద్దిపేట, సిరిసిల్లలే మీ పతనానికి సంకేతం. కరీంనగర్, నిజామాబాద్‌లో మీ కుటుంబ సభ్యులు ఓడిపోయారు. టీఆర్ఎస్ గ్రాఫ్ వేగంగా పడిపోతోంది. మల్కాజ్‌గిరి ప్రజలు ప్రశ్నించే గొంతుకు పట్టం కట్టారు. అవమానించేలా మాట్లాడటం మీ అహంకారానికి నిదర్శనం’’ అని రేవంత్ లేఖలో ధ్వజమెత్తారు.