యూఎస్ టాప్ 50 కంపెనీల్లో టిసిఎస్

SMTV Desk 2019-05-30 13:18:46  united states top 50 companys, tata consultancy services

న్యూయార్క్: ప్రముఖ ఐటి దిగ్గజం టిసిఎస్(టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) మరో ఘనత సాధించింది. టిసిఎస్ అమెరికా టాప్ 50 కంపెనీల్లో ఒకానొక వైవిధ్యమైన సంస్థగా స్థానం దక్కించుకుంది. యుఎస్ ‘2019 టాప్ 50 కంపెనీస్ ఫర్ డైవర్‌సిటీ’ జాబితాలో టిసిఎస్‌ను ఎంపిక చేశారు. స్థిరంగా పెట్టుబడులు, వైవిధ్యం కోసం ప్రయత్నాలు వంటి అంశాలతో దాదాపు 1800 సంస్థలను పరిశీలించగా, వాటిలో 50 కంపెనీలను ఎంపిక చేశారు. వీటిలో భారత్‌కు చెందిన టిసిఎస్ కూడా ఒక సంస్థగా నిలిచింది. నియామకాలు, మహిళలు, మైనార్టీలకు ప్రోత్సాహం వంటి అంశాల్లో టిసిఎస్ గొప్ప సంస్థగా నిలిచింది.