భారీ ఆధిక్యతతో దూసుకుపోతున్న టీడీపీ..

SMTV Desk 2017-08-28 11:44:19  nandhyala elections, winning lead tdp, counting, cm chandrababu nayudu,

నంద్యాల, ఆగస్ట్ 28 : అమరావతిలో సీఎం ఇంటి ఎదుట తెలుగుదేశ౦ పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. నంద్యాల ఉపఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలుపు దిశగా పరుగులు పెడుతున్న తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి ఎదుట టిడిపి నేతలు బాణాసంచా కాలుస్తూ తమ సంతోషాన్ని పంచుకుంటున్నారు. ఇప్పటికే పది రౌండ్లను పూర్తి చేసుకున్న నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలలో టీడీపీ అగ్రపథంలో దూసుకుపోతు౦ది. పదవ రౌండ్లో వైసీపీ 3156 ఓట్లు సాధించగా, తెలుగుదేశం పార్టీ 4642 ఓట్లు సాధించి, 1486 ఓట్ల ఆధిక్యతతో గెలుపుకు చేరువలో పరుగులు పెడుతుంది. ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతూనే ఉంది. కాగా ప్రతి రౌండ్ లో టీడీపీనే ముందు వరుసలో నిలవడం విశేషం.