పాక్ కి మా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది: చైనా

SMTV Desk 2019-05-28 17:00:25  china, pakistan, Chinas vice-president Wang Qishan

బీజింగ్: పాకిస్తాన్ ప్రయోజనాలకు చైనా ఎల్లప్పుడూ మద్దతు తెలుపుతుందని మరోసరి చైనా ఉపాధ్యక్షుడు వాంగ్‌ కీషన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ పరిస్థితులు ఏలా ఉన్నా పాక్‌ వైపునే చైనా నిలబడుతుందని స్పష్టంచేశారు. పాక్‌ పర్యటనలో ఉన్న వాంగ్‌ కీషన్ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా-పాకిస్థాన్‌ రెండు దేశాలు వ్యూహాత్మక భాగస్వాములుగా వ్యవహరించాయని వాంగ్‌ స్పష్టంచేశారు. వ్యాపారంతోపాటు, ఇతర అంశాల్లో కూడా పాక్‌ తో కలిసి చైనా భవిష్యత్‌ లో ముందుకుసాగుతుందన్నారు.