కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తో జపాన్‌ ప్రధాని భేటీ

SMTV Desk 2019-05-28 16:59:07  North Korean leader Kim Jong Un, japan prime minister Shinzo Abe

జపాన్‌ ప్రధానమంత్రి షింజో అబె మారోసారి ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తో సమావేశం కానున్నట్లు ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తో జరిగిన సమావేశాల్లో ఉత్తరకొరియా విషయంపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం ఉత్తరకొరియాపై కీలక వ్యాఖ్యలు చేశారు. కిమ్‌ జోంగ్‌ తో నేరుగా సమావేశమవుతానన్నారు. షరతులు లేకుండా భేటీ అవుతామన్న ఆయన, రెండు దేశాల అభిప్రాయాలను పంచుకుంటామని తెలిపారు. జపాన్‌, ఉత్తరకొరియా దేశాలు సమావేశమయితే అమెరికా మద్ధతు ఉంటుందని ట్రంప్‌ తెలిపారు. ఉత్తరకొరియా ఏజెంట్లు తమ పౌరులను అపహరించినట్లు భావిస్తోన్న జపాన్‌, కిమ్‌ తో సమావేశం ఆసక్తిగా మారింది. ఐతే అపహరణ విషయంతో పాటు అణ్వస్త్ర, క్షిపణి సమస్యలను పరిష్కరించుకోవడానికి జపాన్‌ అనుసరిస్తున్న విధానాల్లో ఎటువంటి మార్పులు ఉండని షింజో అబె స్పష్టం చేశారు.