చంద్రబాబు కు నాగబాబు మద్దతు .. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

SMTV Desk 2019-05-28 15:59:41  Chandrababu, Naga babu,

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. దీంతో అందరూ టీడీపీ అధినేత చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. అయితే జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబు మాత్రం ట్విట్టర్ వేదికగా చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు.

‘చంద్రబాబు గారు మన ex సీఎం..ఇప్పుడు defeat అయినంత మాత్రాన ఆయన్ను దారుణంగా విమర్శించటం తప్పు. మనిషి పవర్ లో ఉండగా విమర్శించటం వేరు. ఓడిపోయాక విమర్శించటం చేతకానితనం.. ప్రత్యర్థి నిరాయుధుడు అయ్యి నిలబడితే వదిలెయ్యాలి. అంతే కాని అవకాశం దొరికింది కదా అని ట్రోల్ చెయ్యటం ఒక సాడిజం’ అని ట్వీట్ చేశారు.

నాగబాబు ట్వీట్‌పై స్పందించిన నెటిజన్లు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. టీడీపీ, జనసేన ఒకటేనని ప్రజల్లోకి వెళ్లిందని, అందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిదంటున్నారు. ఇప్పటికైన టీడీపీని వదిలేసి జనసేన భవిష్యత్తు కార్యక్రమాలపై దృష్టి పెడితే మంచిదని సూచనలు చేస్తున్నారు.