రెండో రోజు కూడా పడిపోయిన పసిడి

SMTV Desk 2019-05-28 15:53:53  Gold Rate, Silver rate, Bullion market

వరుసగా రెండో రోజు కూడా పసిడి ధర పడిపోయింది. జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ తగ్గడంతో సోమవారం దేశీ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.40 తగ్గుదలతో రూ.32,770కు క్షీణించింది. బంగారం ధర పడిపోతే వెండి ధర మాత్రం పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర రూ.90 పెరుగుదలతో రూ.37,500కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌ పుంజుకోవడం ధరపై సానుకూల ప్రభావం చూపింది. దేశీయంగా బంగారం ధర పడిపోతే అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం పెరిగింది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.12 శాతం పెరుగుదలతో 1,285.05 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్స్‌కు 0.05 శాతం పెరుగుదలతో 14.56 డాలర్లకు ఎగసింది. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.40 తగ్గుదలతో రూ.32,770కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.40 తగ్గుదలతో రూ.32,600కు క్షీణించింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.26,500 వద్ద స్థిరంగా కొనసాగింది. కేజీ వెండి ధర రూ.90 పెరుగుదలతో రూ.37,500కు చేరితే.. వారాంతపు ఆధారిత డెలివరీ ధర రూ.114 పెరుగుదలతో రూ.36,498కు ఎగసింది. ఇక 100 వెండి నాణేల కొనుగోలు, అమ్మకం విషయానికి వస్తే.. కొనుగోలు ధర రూ.79,000 వద్ద, అమ్మకం ధర రూ.80,000 వద్ద స్థిరంగా ఉంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.31,890కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.30,370కు పెరిగింది. కేజీ వెండి ధర రూ.39,500కు చేరింది.