ఎస్‌బీఐ కస్టమర్లకు అందుబాటులోకి హాలీడే సేవింగ్స్ అకౌంట్...

SMTV Desk 2019-05-28 15:06:12  state bank of india, sbi holidays savings account

ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు ఎస్‌బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) తన కస్టమర్ల కోసం వివిధ రకాల సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో హాలీడే సేవింగ్స్ అకౌంట్ సర్వీస్ ఒకటి. ఈ సర్వీసు తన కస్టమర్లు టూర్‌కు వెల్లాల్సినప్పుడు ఉపయోగపడుతుంది. ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇందుకోసం ఫేమస్ టూరిజం అండ్ ట్రావెల్ కంపెనీ థామస్ కుక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రత్యేకమైన సేవింగ్స్ అకౌంట్‌ను ఆవిష్కరించింది. టూర్‌కు వెళ్లాలని భావించేవారు ముందు నుంచే ప్రతి నెలా కొంత మొత్తాన్ని ఈ అకౌంట్‌లో డిపాజిట్ చేస్తూ రావాలి. ఈ డబ్బుతో థామస్ కుక్ వెకేషన్ ప్యాకేజ్‌ను ఎంచుకోవచ్చు. అయితే ఎస్‌బీఐ-థామస్ కుక్‌ సహకారంతో వెకేషన్‌‌కు వెళ్లేందుకు ఏం చేయాలో చూద్దాం.. ✺ థామస్ కుక్ వెబ్‌సైట్‌లోక వెళ్లండి. మీకు నచ్చిన ప్యాకేజ్‌ను ఎంచుకోండి.✺ మీరు ఎంచుకున్న ప్యాకేజ్ ధర 13 నెలలకు డివైడ్ అవుతుంది. తర్వాత మీరు ఆన్‌లైన్ ఎస్‌బీఐ పోర్టల్‌కు రీడైరెక్టెడ్ అవుతారు. ✺ ఇక్కడ మీరు ఇ-రికరింగ్ డిపాజిట్ అకౌంట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. 12 నెలలపాటు ఇన్‌స్టాల్‌మెంట్ చెల్లించాల్సి ఉంటుంది. ✺ ఇ-రికరింగ్ డిపాజిట్లపై మీకు వడ్డీ కూడా వస్తుంది. ఈ వడ్డీ రేటు అనేది ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ల ప్రతిపదిదికన ఉంటుంది. ✺ 12 నెలల మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయిన తర్వాత అకౌంట్‌లోని మొత్తం డబ్బు ఒకేసారి థామస్ కుక్ కంపెనీకి వెళ్లిపోతుంది. మీరు ఎంచుకున్న ట్రిప్‌కు వెళ్లిపోవచ్చు. ✺ థామస్‌కుక్ మీకు ఒక నెల ఇన్‌స్టాల్‌మెంట్‌ను ఉచితంగానే కట్టేస్తుంది. మీ ప్యాకేజ్ ధర ప్రారంభంలోనే 13 నెలలకు డివైడ్ అవుతుంది. ఇందులో మీరు 12 ఇన్‌స్టాల్‌మెంట్లే చెల్లిస్తారు. మిగతా ఒక్కటి థామస్‌కుక్ కట్టేస్తుంది. ‌