జపాన్ కొత్త చక్రవర్తితో ట్రంప్ భేటీ

SMTV Desk 2019-05-27 18:14:38  japan, america, donald trump

టోక్యో: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం జపాన్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జపాన్ కొత్త చక్రవర్తి నరూహిటోతో తాజాగా ట్రంప్ భేటీ అయ్యారు. కొత్తగా చక్రవర్తి అయిన నరూహిటోను కలిసిన అంతర్జాతీయ నేత ట్రంప్ కావడం గమనార్హం. తన భార్య మెలానియా ట్రంప్ తో కలిసి ఆయన ఇంపీరియల్ ప్యాలెస్ కు చేరుకున్నారు. ఈ క్రమంలో ట్రంప్ దంపతులకు రెడ్ కార్పెట్ పై ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ట్రంప్ దంపతులు నరూహిటో దంపతులతో భేటీ అయి ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఇరు దేశాలు పరస్పరం సహకరించుకొని ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలవాలని వారు పేర్కొన్నారు.