రేపు ఢిల్లీ వెళ్లనున్న ఆంధ్ర ప్రదేశ్ కొత్త సీఎం

SMTV Desk 2019-05-25 22:14:39  YS jagan, Modi,

వైసీపీ అధినేత జగన్‌ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. జగన్‌తో పాటు సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా దేశ రాజధాని బయలు దేరతారు. ఆదివారం ఉదయం 8.30కు వీరు ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోడీతో వైఎస్ జగన్‌ భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ నెల 30న విజయవాడలో ముఖ్యమంత్రిగా తన ప్రమాణస్వీకారానికి రావాలని మోడీని జగన్‌ ఆహ్వానించనున్నారు. కాగా ఢిల్లీ పర్యటన కారణంగా మొదట తాను భావించిన ఇడుపులపాయ పర్యటనను జగన్‌ రద్దు చేసుకున్నారు. ఈ నెల 29న ఇడుపులపాయ పర్యటన చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుంది.