జనసేనాని నెక్స్ట్ ప్లాన్ ఏంటి ?

SMTV Desk 2019-05-25 15:28:57  Janasena, pawan kalyan,

ఏపి ఎలక్షన్స్ లో జనసేన పార్టీ తరపున తనదైన ముద్ర వేస్తాడని భావించిన పవన్ కళ్యాణ్ ఆశించిన స్థాయిలో కాదు కాదు ఖాతా తెరవడంలో కూడా తడపడ్డాడు. అధినేతగా తాను ఓడిపోయి పార్టీ అభ్యర్ధి ఒక్క చోట మాత్రమే గెలిచిన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాల తర్వాత తాను గెలవకున్నా బయట ఉండి ప్రజల సమస్యలకై పోరాడుతా అంటున్నాడు పవన్.

అంతేకాదు చివరి శ్వాస వరకు రాజకీయాల్లోనే కొనసాగుతా అన్నారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కొద్దిపాటి గ్యాప్ ఇచ్చి సినిమాలు చేస్తాడని కొందరు అంటుంటే చెప్పినట్టుగానే పాలిటిక్స్ లోనే కొనసాగుతాడని మరికొందరు అంటున్నారు. రాజకీయాల్లో ఎప్పుడూ పని ఉండదు కనీసం గెలిచినా అసెంబ్లీకి అటెండ్ అవ్వాలన్న కండీషన్ ఉంటుంది కాని ఇప్పుడు అది కూడా లేదు కాబట్టి పవన్ ఎంచక్కా సినిమాలు చేసుకోవచ్చు.

ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చి రెడీగా ఉన్న నిర్మాతలు పవన్ ఎప్పుడు వచ్చి సినిమాలు చేస్తాడా అని ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ జనసేన ప్రస్తుతం ఏపిలో ఒక సీటుకే పరిమితమైనా ఆయన ఇలానే తన పోరాటాన్ని సాగిస్తే ఏదో ఒకరోజు మంచి ఫలితాలే రాబట్టే అవకాశం ఉంది. ఇక అందాకా ప్రజల సమస్యల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ అటు సినిమాలు కూడా చేయొచ్చని కొందరి సలహా. మరి జనసేనాధిపతి ఎలా ఆలోచిస్తున్నాడో తెలియాల్సి ఉంది.