రూ.1ల‌క్ష గెలుచుకునే అవ‌కాశం

SMTV Desk 2019-05-10 16:58:03  tiktok,

ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా యాప్ టిక్‌ టాక్ పై నిషేధం ఎత్తివేయ‌డంతో ఆ యాప్ మ‌ళ్లీ గూగుల్ ప్లే స్టోర్‌, యాపిల్ యాప్ స్టోర్స్‌లో యూజ‌ర్ల‌కు అందుబాటులోకి వచ్చింది. టిక్‌టాక్ యాప్ మ‌ళ్లీ ఆయా యాప్ స్టోర్స్‌లో అత్య‌ధికంగా డౌన్‌లోడ్ అవుతున్న యాప్‌ల‌లో మొద‌టి స్థానంలో నిలిచింది. ఈ క్ర‌మంలోనే టిక్‌ టాక్ త‌న యూజ‌ర్ల‌కు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. యూజర్లు రోజూ రూ.1ల‌క్ష గెలుచుకునే అవ‌కాశం క‌ల్పించింది.

టిక్‌ టాక్ యూజ‌ర్లు #ReturnofTikTok పేరుతో టిక్‌ టాక్ మైక్రోసైట్‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయాలి. దీంతో షేర్ చేసిన యూజ‌ర్ల‌లోంచి ముగ్గురు ల‌క్కీ విన్న‌ర్ల‌ను టిక్‌ టాక్ ఎంపిక చేస్తుంది. వారికి రూ.1 లక్ష న‌గ‌దు గిఫ్ట్ గా అంద‌జేసస్తారు. కాగా తమ యాప్ కొద్ది రోజుల పాటు బ్యాన్ అయినందునే యాప్ ప్ర‌మోష‌న్ కోసం ఇలా ఓ కాంటెస్ట్‌ను నిర్వ‌హిస్తున్నామ‌ని టిక్‌ టాక్ తెలియ‌జేసింది.