గూగుల్ కొత్త స్మార్ట్ ఫోన్స్ చూసారా

SMTV Desk 2019-05-10 16:57:10  Google new Smart phones,

గూగుల్ తన లేటెస్ట్ జనరేషన్ స్మార్ట్‌‌‌‌ఫోన్లు పిక్సెల్ 3ఏ, పిక్సెల్ 3ఏ ఎక్స్‌‌‌‌ఎల్‌‌‌‌ లను లాంచ్ చేసింది. ఈ రెండు స్మార్ట్‌‌‌‌ఫోన్లు మే 15 నుంచి ఇండియన్ మార్కెట్‌‌‌‌లో ఎక్స్‌‌‌‌క్లూజివ్‌‌‌‌గా ఫ్లిప్‌‌‌‌కార్ట్‌‌‌‌లో అందుబాటులో ఉంటాయి. వీటి మార్కెట్‌‌‌‌ ధర రూ.39,999 నుంచి ప్రారంభమవుతుంది. ఈ కొత్త స్మార్ట్‌‌‌‌ఫోన్లలో బెటర్ కెమెరా ఫీచర్లను, మెరుగైన బ్యాటరీ లైఫ్‌‌‌‌ను గూగుల్ ఆఫర్ చేస్తోంది. పిక్సెల్ 3ఏ స్మార్ట్‌‌‌‌ఫోన్‌‌‌‌లో 5.6 ఇంచ్ డిస్‌‌‌‌ప్లే, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్, 12.2 ఎంపీ రియర్, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాలు, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. పిక్సెల్ 3ఏ ఎక్స్‌‌‌‌ఎల్‌‌‌‌ స్మార్ట్‌‌‌‌ఫోన్‌‌‌‌కు అతిపెద్దగా 6 అంగుళాల డిస్‌‌‌‌ప్లే, 3,700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ప్రతి ఒక్కరి కోసం రూపొందించడం.. ఇదే కంపెనీ ప్రధాన ఫిలాసఫీ అని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చెప్పారు.