40 ఏళ్లు సీఎంగా ఆయనే ఉంటారు: సినీ నటి రమ్యశ్రీ

SMTV Desk 2019-05-10 16:36:16  ramyasri, tollywood character artist, ysrcp, ys jagan

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పులిబిడ్డ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు సినీ నటి, వైసీపీ నేత రమ్యశ్రీ. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఓ మీడియా ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఓపిక ఉన్నంత వరకు వైఎస్ జగనే సీఎం అంటూ జోస్యం చెప్పారు. ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి వైఎస్ జగన్ అని చెప్పుకొచ్చారు. 40 ఏళ్లు సీఎంగా జగనే ఉంటారని ఆమె జోస్యం చెప్పారు.

ఆ పదవి నుంచి వైఎస్ జగన్ పీకే వారెవరూ లేరంటూ ఆమె ధీమా వ్యక్తం చేశారు. ప్రజల మనసులను గెలుచుకున్న వ్యక్తి వైఎస్ జగన్ అని అందువల్ల ఓటమి అనేది ఆయన ఇక ఎరుగడన్నారు.

గతంలో దివంగత సీఎం ఎన్టీఆర్, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిలు కూడా ప్రజలు మనసులు గెలుచుకున్నారని అందుకే వారు తిరుగులేని నాయకులు అయ్యారని అలాగే వైఎస్ జగన్ కూడా తిరుగులేని నేత కాబోతున్నారంటూ చెప్పుకొచ్చారు.

వారు ఇప్పటి వరకు బతికి ఉంటే వారిని ఓడించే వారే ఉండేవారు కాదన్నారు. జగన్ తెలివైన వ్యక్తి అని కేవలం రాష్ట్ర రాజకీయాలే కాకుండా జాతీయ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించాలని వైసీపీ నేత, సినీనటి రమ్య శ్రీ ఆకాంక్షించారు.