బరువు తగ్గాలంటే ఒక చక్కటి ఉపాయం

SMTV Desk 2019-05-10 16:34:03  weight loss

మండే ఎండలకు కాస్త ఉపశమనం చల్లచల్లని ముంజలు. వీటితో శరీరం చల్లబడుతుంది. ఇవి తింటే ఆరోగ్యంతో పాటు అందం కూడా సొంతం అవుతుంది. ముంజల్లో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకుంటే చాలు, పొట్ట నిండినట్లు అనిపించి, మిగతా ఆహారం మితంగా తీసుకుంటాం. అధిక బరువు నుంచి బయటపడటానికి పరోక్షంగా దోహదం చేస్తాయి. శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తాయి. వీటిలో విటమిన్ ఎ, బి, సి, ఇనుము, జింక్, పాస్ఫరస్, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వేసవిలో వచ్చే నీటి పొక్కులు, పేలడం వంటి సమస్యలు ఎదురైనప్పుడు చర్మం దురద పుడుతుంది. అటువంటప్పుడు ముంజలను తీసుకుంటే ఆ సమస్యలు అదుపులో ఉంటాయి. వీటిలో ఉండే నీరు మన శరీరాన్ని డీహైడ్రేషన్‌కు గురి కాకుండా చేస్తుంది. ఎండవేడి నుంచి కాపాడుతుంది.

అధిక చెమట వల్ల వచ్చే నిస్సత్తువ నుంచి కూడా సులువుగా ఉపశమనం పొందొచ్చు. గర్భిణుల్లో తలెత్తే జీర్ణాశయ సమస్యలకు చెక్ పెడతాయివి. ఎసిడిటీని దూరం చేసే గుణాలు వీటిలో ఉన్నాయి. అజీర్తిని కూడా తగ్గిస్తాయి. ఉదయంపూట కప్పు ముంజల రసాన్ని తీసుకుంటే మలబద్ధకం దూరం అవుతుంది. వీటిలో ఉండే పొటాషియం శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. దీంతో కాలేయానికి సంబంధించిన ఎదురుకావు. రక్తహీనతను కూడా దూరం చేస్తాయివి. మొటిమలపై ముంజుల్లో ఉండే నీటిని రాస్తే అవి తగ్గుముఖం పడతాయి.ముంజల్లో కెలొరీలు తక్కువే కానీ.. అవసరమైన శక్తిని పొందొచ్చు. శరీరం నిస్సత్తువగా అనిపించినప్పుడు వీటిని తింటే తక్షణ శక్తి అందుతుంది.