రేగిపండ్ల వల్ల ఇంత ఆరోగ్యమా?

SMTV Desk 2019-01-07 18:04:28   Health Benefits , Health Tips , Nutrition , Diseases , Indian Jujube

రేగిపండ్లు ముఖ్యంగా చలి కాలంలో ఎక్కువగా లభిస్తాయి. ఇవి అనేక రకాలు ఉంటాయి. చిన్నవి, పెద్దవి వివిధ రకాల రుచులను కలిగి ఉంటాయి. రేగి పండ్లంటే ఎవరైనా ఇష్టంగా తింటారు. వీటిని శీత కాలంలో తింటే మనకు అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో తెలుసుకుందాం.

1. రేగిపండ్లలో విటమిన్ ఎ, సిలు పుష్కలంగా ఉంటాయి. దీంతో శరీర రోగ నిరోధక శక్తి, కంటి చూపు పెరుగుతాయి. వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. ఈ సీజన్‌లో వచ్చే దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

2. రేగిపండ్లను తినడం వల్ల హైబీపీ తగ్గుతుంది. గుండెకు రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది. రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

3. రక్తహీనతతో బాధపడేవారు రేగి పండ్లను తింటే మంచిది. వీటిల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీంతో రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.

4. రేగిపండ్లలో ఉండే కాల్షియం ఎముకలను బలంగా చేస్తుంది. స్త్రీలకు రుతు సమయంలో వచ్చే సమస్యలు తగ్గుతాయి.

5. రేగిపండ్లను తినడం వల్ల చర్మం సురక్షితంగా ఉంటుంది. చర్మం పగలకుండా ఉంటుంది.