అమెరికా అధ్యక్షా... డిక్షనరీ కొనుక్కోండి: నెటిజన్లు

SMTV Desk 2017-08-25 14:33:38  USA President, Trump, Tweet, Spelling mistake, Sensation

అమెరికా, ఆగస్ట్ 25: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సామాజిక మాధ్యమ అభిమానులను అమెరికా అధ్యక్షుడు కలిగి ఉన్నాడు. దానికి తగినట్లే ఆయన సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. ఈ నేపధ్యంలో ఆయన న్యూస్ ఛానల్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ట్విట్టర్‌ని కొనియాడుతూ ట్వీట్ కూడా చేశారు. అయితే ఇటీవల ఆయన ట్వీట్స్ పై అభిమానులు విమర్శలు సంధిస్తున్నారు. దీనికి కారణం ఆయన ట్వీట్స్ లో తరచు వస్తున్న స్పెల్లింగ్ మిస్టేక్స్. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ లో too కి బ‌దులుగా to అని రాశారు. కాగా, ఇటీవల ఆయన healకి బదులుగా heelఅని పోస్ట్ చేయగా, విమర్శల అనంతరం మార్పు చేశారు. గతంలో కూడా కవరేజ్ అనే ప‌దానికి స్పెల్లింగ్ త‌ప్పుగా కౌఫెఫె అని రాశారు. కౌఫెఫె అంటే ఏంటో అర్థం కాక నెటిజ‌న్లు చాలా కష్టపడ్డారు. దీంతో అధ్యక్షుడి ట్రంప్‌కి పలువురు నెటిజన్లు డిక్ష‌న‌రీ కొనుక్కుని ద‌గ్గ‌ర పెట్టుకోవాల‌ని, అందులో చూసి స్పెల్లింగ్‌లు టైప్ చేయాలని సూచిస్తున్నారు.