ఏపీ పదోతరగతి పరీక్ష ఫలితాలకు ముహూర్తం ఫిక్స్

SMTV Desk 2019-05-09 13:42:51  Ap tenth results,

ఏపీ పదోతరగతి పరీక్ష ఫలితాలను వీలైనంత త్వరగా వెల్లడించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని పనులు సకాలంలో పూర్తయితే మే 14న ఫలితాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు 6,21,634 మంది విద్యార్థులు హాజరయ్యారు. అయితే ఇప్పటికే విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తికాగా పాఠశాలల నుంచి ఇంటర్నల్ మార్కులు రాకపోవడంతో ఫలితాల ప్రక్రియ ఆలస్యమైందని అంటున్నారు. దీంతో తదుపరి చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వ పరీక్షల విభాగం సంబంధిత ఉపాధ్యాయులను ఇంటర్నర్ మార్కులతో వెంటనే తమ వద్దకు హాజరుకావాల్సిందిగా ఆదేశించినట్టు చెబుతున్నారు. ఈ మేరకు ఆయా స్కూల్స్ కి సంబందించిన ఉపాధ్యాయులు నిన్న ప్రభుత్వ పరీక్షల విభాగం ముందు హాజరయ్యారు. విద్యార్థుల ఇంటర్నల్ మార్కులను సమర్పించారు. అయితే మార్కులు అందినా వాటిని అప్‌లోడ్ చేయడానికి కాస్త సమయం పడుతున్న నేపథ్యంలో మే 13 నుంచి 15 తేదీల్లో ఎప్పుడైనా ఫలితాలు వెల్లడించే అవకాశం ఉందని అంటున్నారు.