మమత పై ప్రశంసల జల్లు కురిపించిన బాబు...

SMTV Desk 2019-05-09 13:37:58  Mamata, Chandrababu

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తోకలిసి ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, మమతా బెనర్జీ పై ప్రశంసల జల్లు కురిపించారు… ఈ సందర్బంగ మాట్లాడిన చంద్రబాబు ఈ రాష్ట్రము అభివృద్ధి కావాలంటే కేవలం అది మమతా బెనర్జీతోనే సాధ్యం అవుతుందని, అందుకని ప్రజలందరూ కూడా బెంగాల్ అభివృద్ధి కోసం తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మరొకసారి అధికారాన్ని కట్టబెట్టాలని చంద్రబాబు కోరారు. అంతేకాకుండా మమతా బెనర్జీ ని చంద్రబాబు బెంగాల్ టైగర్ గా అభివర్ణించారు.

ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ వారికి కొన్ని సూచనలను చేశారు… కాలిగా ఓటు వేసి బయటకు రాకుండా, ఓటు వేసిన తర్వాత తమ ఓటు ఏ పార్టీకి వేశామో, ఓటు ఎవరికీ పడిందో తెలియాలంటే వీవీప్యాట్ స్లిప్సులను సరి చూసుకోవాలని చంద్రబాబు అన్నారు. అంతేకాకుండా ఓటింగ్ సమయంలో ఎవరైనా తప్పు చేస్తే నిలదీయాలని, ఎవ్వరిని వదిలిపెట్టొద్దని అన్నారు. రానున్న ఎన్నికలా ఫలితాల తరువాత బీజేపీ అధికారాన్ని కోల్పోవడం ఖాయమని, రానున్న రోజుల్లో బీజేపీయేతర ప్రభుత్వం రావడం ఖాయమని చంద్రబాబు స్పష్టం చేశారు.