బెంగాల్ లో చంద్రబాబు పోరాటం

SMTV Desk 2019-05-08 12:16:02  chandrababu, west bengal,

ఏపీ సీఎం చంద్రబాబు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కి మద్దతుగా ఈ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు… అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొననున్నారు. చంద్రబాబు జార్గాం, హల్దియా, కోల్‌కతా, ఖరగ్‌పూర్ ప్రాంతాల్లో నిర్వహించే సభల్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాల్గొంటారు. అయితే ఇప్పటికే చంద్రబాబు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులో మిత్రపక్షాలకు మద్దతిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

అంతేకాకుండా ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు కి మద్దతుగా మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్‌లు కూడా పాల్గొన్నారు. ప్రతిపక్షాలను అన్నింటిని ఏకం చేసి, మోడీని గద్దె దించడమే లక్ష్యంగా చంద్రబాబు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.