అధికార పార్టీ అండ చూసుకునే కాల్పులు: శిల్పా చక్రపాణి

SMTV Desk 2017-08-24 14:40:42  Nandyala, YSRCP, TDP, Abhiruchi Madhu, Silpa Chakrapani,

నంద్యాల, ఆగస్ట్ 24: నేటి ఉదయం నంద్యాలలో అధికార, ప్రతిపక్షాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సంఘటనలో టీడీపీ నేత అభిరుచి మధు యొక్క ప్రైవేట్ గన్ మెన్ కాల్పులు జరిపాడు. ఈ క్రమంలో వైసీపీ నేత శిల్పా మోహన్ రెడ్డి, టీడీపీ నేత అభిరుచి మధుల అనుచరులు పరస్పరం దాడికి దిగారు. ఈ తరుణంలో మధుకు చెందిన ఆడీ కారు ధ్వంసమైంది. అయితే ఈ సంఘటనపై శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ... ప్రైవేట్ గన్ మెన్‌తో తమపై కాల్పులు కావాలనే మధు ఓ రౌడీ షీటర్‌లా చేయించాడని ఆయన మండిపడ్దారు. కారు పక్కకు తీయమని అడిగితే ఇంత ఉద్రిక్తత సృష్టించాడు. తనది అధికార పార్టీ అనే ధైర్యంతో మధు ఇంతటి దౌర్జన్యానికి దిగుతాడా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సూరజ్ హోటల్ పరిసర ప్రాంతంలో 144 సెక్షన్ ను విధించారు.