ఫణి: బంగ్లాదేశ్ లో 14మంది మృతి...మరో 50 మందికి గాయాలు

SMTV Desk 2019-05-05 17:05:26  fani, nellore fani tsunami, srikakulam , bangladesh

ఢాకా: తీరం దాటుతున్న ఫణి తుఫాను ప్రభావంతో బంగ్లాదేశ్ లో 14మంది మృత్యు వాత పడ్డారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. భారత్ లోని ఒడిశా, ఎపి, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలపై ఫణి తుఫాను తీవ్ర ప్రభావం చూపిన విషయం తెలిసిందే. ఇప్పడు తీరం దాటిన ఈ తుఫాను బంగ్లాదేశ్ పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఫణి తుఫాను కారణంగా ప్రభావిత ప్రాంతాలకు చెందిన 16 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు బంగ్లాదేశ్ అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్ లోని 8 జిల్లాలపై ఫణి తుఫాను ప్రభావం తీవ్రంగా ఉందని అధికారులు వెల్లడించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టామని, తుఫాను బాధిత ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని అధికారులు చెప్పారు.