నంద్యాలలో ప్రారంభమైన పోలింగ్..

SMTV Desk 2017-08-23 10:41:38  NANDHYALA ELECTIONS START

నంద్యాల, ఆగస్ట్ 23 : నంద్యాల ఉప ఎన్నికల పోలింగ్ సమయం ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, ఓటు హక్కును వినియోగించుకునేందుకు భారీ ఎత్తున ప్రజలు బారులు తీరారు. ఓటింగ్ శాతం ఇంకా పెరగవచ్చనే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నియోజక వర్గం మొత్తం సమస్యాత్మకంగా మారడంతో పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. తొలి రెండు గంటల వ్యవధిలోనే ఇరవై శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. ఒకటి రెండు చోట్ల ఈవీఎంలు మొరాయించడం మినహా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ కొనసాగుతుంది. అయితే ఎన్నికల ఫలితాలు ఈ నెల 28న వెల్లడి కానున్నాయి.