మాది ఆపధర్మ ప్రభుత్వం కాదు... ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం

SMTV Desk 2019-05-04 12:21:17  Somi reddy,

టీడీపీ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రశేఖరరెడ్డి కొన్ని ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు. ”మాది ఆపధర్మ ప్రభుత్వం కాదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. కేబినెట్‌ మీటింగ్‌లూ పెట్టుకోవచ్చు.” అని వాఖ్యలు చేశారు. కాగా రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, అకాల వర్షాలు, ఫొని తుఫాను ప్రభావం వంటి విషయాలపై సంబంధిత అధికారులతో చర్చలు జరిపారు. కాగా ఈ సమీక్షలు జరపటానికి ఎన్నికల సంఘం నుండి ఎలాంటి అనుమతి తీసుకోలేదని అన్నారు. కాగా ఎలాంటి నియమాలు తెలియని వారు కూడా మా మీద తప్పుడు వాఖ్యలు చేస్తున్నారని, ముందు వారు తెలుసుకొని మాట్లాడాలని ఆయన అన్నారు.

కాగా రాబోయే రబీ సీజన్‌లో రైతులకి ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా అవసరమైనటువంటి విత్తనాలు, ఎరువులు సరఫరా చేయాలని ఆదేశించామన్నారు. మొత్తం 9 జిల్లాలలో 13.42 లక్షల హెక్టర్లలో 1832.29 కోట్లు విలువైన పంట నష్టం జరిగిందని, 15.97 లక్షల రైతుల వివరాలతో విపత్తు నిర్వహణ శాఖకు తుది ప్రతిపాదనలు పంపామని అన్నారు. 2018-19 ఖరీఫ్‌, రబీ సీజన్‌లలో వంద శాతం రుణాలు మంజూరు చేశామని, రాష్ట్ర వ్యాప్తంగా రూ.1,01,345 కోట్లు పంపిణీ చేశామని చెప్పారు. 2019-20 లో రూ.1,13,977.21 కోట్ల రుణాలు మంజూరు చేయాలని లక్ష్యం నిర్ధేశించుకున్నామన్నారు. ఇప్పటి వరకు రైతులకు రు.3728 కోట్లు చెల్లించామని, ఇంకా పెండింగ్‌ బిల్లులకు సంబంధించి రూ.2108 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని చెప్పారు.