'ఫణి' తుఫాను : పార్టీ కార్యకర్తలకు జగన్ పిలుపు

SMTV Desk 2019-05-03 18:09:01  fani, nellore fani tsunami, srikakulam , ysrcp, ys jagan mohan reddy

అమరావతి: రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫణి తుఫానుపై అరా తీశారు. వైఎస్‌ఆర్‌సిపి శ్రీకాకుళం జిల్లా నేతలు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్‌, తమ్మినేని సీతారాం, కిల్లి కృపారాణితో పాటు పలువురితో జగన్‌ మాట్లాడారు. అంతేకాక ఈ సందర్భంగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలతో సమన్వయం చేసుకుని పనిచేయాలని జగన్‌ కోరారు.