సీఎం vs సిఎస్‌ !

SMTV Desk 2019-05-03 16:16:18  lv subramanyam, chandra babu naidu

అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు సిఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు మధ్య వివాదంలో మాటల తూటాలు పేలుతున్నాయి. వీరిద్దరి మధ్య వివాదం రాచపుండులా అవుతుంది. సియం చంద్రబాబుకు సిఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఇచ్చిన ఏకవాక్య సమాధానం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. దీనిపై ఘాటుగా స్పందించేందుకు సిఎంవో సిద్ధమవుతుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కొత్త వివాదాలకు కారణమవుతుంది. చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాదని..అయినప్పటికీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా ఆయనకు అధికారాలుండవని ఈసి నియమించిన సిఎస్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. దీనిపై సియం చంద్రబాబు సీరియస్‌గా స్పందించారు. సిఎస్‌ వ్యాఖ్యలపై వివరణ కోరుతూ చంద్రబాబు లేఖ రాశారు.