మోదీపై పోటీకి విశాఖ యువకుడు!

SMTV Desk 2019-05-03 11:54:06  pm modi, narendra modi, loksabha elections 2019, vishakhapatnam guy nomination in loksabha election against modi

విశాఖపట్టణం: లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూపోతోంది. రైతులపై మోదీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ నిజామాబాద్‌కు చెందిన 40 మంది పసుపు, ఎర్రజొన్న రైతులు వారణాసిలో నామినేషన్ వేసేందుకు వెళ్లారు. చివరికి 25 మంది రైతులు నామినేషన్ వేసినా 24 మంది రైతుల నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. దీంతో ఒకే ఒక్క రైతు బరిలో మిగిలాడు. అలాగే మాజీ సైనికుడు తేజ్ బహదూర్ యాదవ్ కూడా మోదీపై పోటీకి నామినేషన్ వేసినా కూడా అధికారులు తిరస్కరించారు. తాజాగా విశాఖపట్టణానికి చెందిన ఓ యువకుడు కూడా మోదీపై పోటీ చేస్తున్నాడు. వైజాగ్‌లోని విశాలాక్షి నగర్‌కు చెందిన మానవ్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాడు. గత నెలలో ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ మానవ్ పోటీ చేశాడు. విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు.