వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్‌ను విచారించాలి: టిడిపి నేత

SMTV Desk 2019-05-02 16:16:17  varla ramaiah, tdp, ys jagan mohan reddy, ys vivekananda reddy

విజయవాడ: టిడిపి నేత వర్ల రామయ్య వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్‌ను విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. కేసును పక్కతోవ పట్టిస్తున్నారని, ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టలేడు అన్న చందంగా ఉంది ఈ కేసు విచారణ. ఇంటి దొంగలను ఎందుకు అరెస్టు చేయలేదో జవాబు చెప్పాలని కోరారు. ఎంపి అవినాష్‌రెడ్డి కాల్‌ డేటా ఎందుకు తీసుకోలేదని అడిగారు. తండ్రిని ఎవరు చంపారో వివేకా కూతురికి తెలసునని చెప్పారు. దర్యాప్తు ఆపాలని సిట్‌కు హైకోర్టు చెప్పలేదని పేర్కొన్నారు.