బ్రిటన్: బెయిల్ నిబంధనలు ఉల్లంఘించినందుకు వికీలీక్స్ జూలియన్ అసాంజేకు బ్రిటన్ కోర్టు జైలు శిక్ష విధించింది. స్వీడన్ మహిళ లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో బ్రిటన్ కోర్టు నుంచి బెయిల్ పొందిన అసాంజే 2012 నుంచి లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో తలదాచుకున్నారు. అసాంజేకు ఇచ్చిన దౌత్యపరమైన వెసులుబాటును ఈక్వెడార్ ప్రభుత్వం ఉపసంహరించుకోడంతో గత నెలలో బ్రిటన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన సౌత్‌వార్క్ క్రౌన్ కోర్టు ..అసాంజేకు 50 వారాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.