సౌదీ అరేబియా, ఆగస్ట్ 22 : ఈ మధ్య సౌదీలో చిన్న చిన్న విషయాలకే విడాకులు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. కేవలం తనకంటే ముందు నడిచిందని ఓ వ్యక్తి తన భార్యకు విడాకులిచ్చాడు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఈ మధ్య కాలంలో ఇలాంటి వింత సంఘటనల వల్ల కొందరు వ్యక్తులు తమ తమ భార్యలకు విడాకులు ఇస్తున్న ఘటనలు సౌదీలో చోటు చేసుకు౦టున్నాయి. పూర్తి వివరాలిలా ఉన్నాయి.. "భార్య ఎప్పుడు భర్తకు విధేయురాలై ఉండాలని ఖురాన్ చెబుతుంది కదా..! దాని ప్రకారం నడవడం లేదేందుకు..? నాకంటే ముందు నడవవద్దని, నన్ను అనుసరించమని ఎన్నిసార్లు చెప్పిన వినవేంటి..?" అంటూ ఆరోపిస్తూ తన భార్యకు విడాకులు ఇచ్చేశాడు. దీనిపై ఓ అధికారి స్పందిస్తూ సౌదీ అరేబియాలో మహిళలపై జరుగుతున్న వివక్షతకు ఇది ఒక ఉదాహరణ అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. మరో వ్యక్తి స్నేహితులకు ఇచ్చే విందులో పద్ధతి ప్రకారం మేకతలను ముందుగా టేబుల్ వద్ద ఉంచనందుకు, మరొక వ్యక్తి తన భార్య తనకు ఇష్టంలేని కాళ్ళ కడియాలు పెట్టుకుందని విడాకులు ఇచ్చేశారు. అయితే కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా కేవలం భార్యకు మూడు సార్లు తలాక్(ట్రిపుల్ తలాక్) చెబితే సరిపోతుందనే విధానం ఇందుకు కారణంగా భావిస్తున్నారు.