ఏపీపీఎస్సీ 446 పోస్టులకు...3లక్షల మంది దరఖాస్తులు

SMTV Desk 2019-05-01 12:37:19  appsc group 2, group 2 post notifications

అమరావతి: ఏపీపీఎస్సీ 446 పోస్టుల భర్తీ కోసం నిర్వహించనున్న గ్రూప్-2 పరీక్షకు 3లక్షల మంది దరఖాస్తు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 5న స్క్రీనింగ్ టెస్ట్ ను తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాల్లో నిర్వహించనున్నారు. మొత్తం 727 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఓఎంఆర్ ఆధారంగానే స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందని ఏపీపీఎస్సీ చైర్మెన్ ఉదయభాస్కర్ తెలిపారు. ఈసారి గ్రూప్ 2 ప్రిలిమ్స్‌ పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయని.. ఒక్కో తప్పునకు 1/3వంతు మార్కు కోత పడుతుందన్నారు. ఎల్‌ఐసీ ఏఏవో ప్రిలిమ్స్ పరీక్ష సైతం అదే రోజున ఉండడంతో గ్రూప్2 పరీక్షను వాయిదా వేయలేమని ఆయన తేల్చి చెప్పారు. వేరే పరీక్షలు ఉన్నాయని వాయిదా వేసుకుంటూ పోతే గ్రూప్స్ పరీక్షలు నిర్వహించలేమన్నారు. అభ్యర్థులకు ఏవైనా సమస్యలు ఎదురైతే.. ఏపీపీఎస్సీ హెల్ప్‌లైన్‌ సెంటర్‌తో పాటు జిల్లా హెల్ప్‌లైన్‌ సెంటర్లను సైతం అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. పరీక్షకు ఒక రోజు ముందు జిల్లాల హెల్ప్‌లైన్‌ సెంటర్ల నంబర్లను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామన్నారు.