ఏటీఎంలో మనీ రాలేదని ఇలా చేసారు !!!

SMTV Desk 2017-08-22 09:57:55  amerikaa, paytm, robbery,, cc tv footage

న్యూయార్క్, ఆగస్ట్ 22 : అమెరికాలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఏటీఎం నుంచి ఎంత దొరికితే అంత దొంగతనం చేయడానికి వచ్చారు. కాని అది కుదరకపోవడంతో ఏకంగా ఏటీఎంనే ఎత్తుకెళ్ళారు. వివరాలలోకి వెళితే.. అమెరికా ఆర్కాన్సాస్‌లోని కాన్‌వే పట్టణంలో ఒక బ్యాంకు డ్రైవ్ వే ద్వారా నగదు తీసుకునేలా అక్కడ ఒక ఏటీఎంను ఏర్పాటు చేసింది. అయితే అందులో డబ్బుందని గ్రహించిన దొంగలు దానిలో నుంచి ఎలాగైనా కొల్లగొట్టాలని శతవిధాలా ప్రయత్నించారు. కాని వారి ప్రయత్నాలన్ని బూడిదలో పోసిన పన్నీరు అవడంతో ఇక ఆధునాతన సాంకేతికతను ఉపయోగించి ఏటీఎంనే ఎత్తుకెళ్ళారు. ఈ సంఘటన మొత్తం అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డ్ అవడంతో ఫిర్యాదు అందుకున్న పోలీసులు సీసీ పుటేజ్ లను పరిశీలిస్తున్నారు. వీరు బహుశా భవన నిర్మాణ కార్మికులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.