భారత ఖైదీలను విడుదల చేసిన పాక్

SMTV Desk 2019-04-30 17:47:37  pakistan government released indian prioseners

ఇస్లామాబాద్: పాకిస్తాన్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న 60మంది భారతీయులను తాజాగా పాక్ సర్కార్ విడుదల చేసింది. విడుదైలన వారిలో 55 మంది మత్స్యకారులు ఉన్నారు. ఖైదీలందరిని వాఘా సరిహద్దు వద్ద పాక్ అధికారులు భారత అధికారులకు అప్పగించారు.సముద్రంలో చేపల వేట కోసం పాకిస్థాన్ జలాల్లోకి వెళ్లడంతో మత్స్యకారులను పాక్ కోస్ట్ గార్డ్ అధికారులు అరెస్ట్ చేశారు. సరైన వీసా, డాక్యుమెంట్లు లేకపోవడంతో ఐదుగురుని పాకిస్థాన్ లోనే అరెస్ట్ చేశారు.