తొలిసారి భేటికి సిద్దమయిన రష్యా, ఉత్తరకొరియా

SMTV Desk 2019-04-24 17:13:45  russia, north korea, Kim Jong Un, Vladimir Putin

మాస్కో: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో తొలిసారి భేటీ కానున్నారు. ఈ క్రమంలో కిమ్‌ జోంగ్‌ ఉన్‌ బుధవారం మధ్యాహ్నం రష్యా చేరుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో వ్లాదివోస్తోక్‌లో కిమ్ గురువారం భేటీ అవుతారు. ఇరు దేశాల మధ్య జరిగే చర్చలపై ముందుస్తు ప్రణాళికలు తయారు చేయలేదు. ప్రత్యేక ట్రైనులో ఉత్తరకొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌ నుంచి రష్యాకు కిమ్‌ వచ్చారు. ఉత్తరకొరియా సరిహద్దు ప్రాంతం ఖాసన్‌లోని రైల్వే స్టేషన్‌ నుంచి రష్యాలోని వ్లాదివోస్తోక్‌లోకు తొమ్మిది గంటల ప్రయాణ సమయం పడుతోంది. కిమ్ కు రష్యా అధికారులు తమ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు.