అమ్మాయిలు సెల్‌ఫోన్లు, వాట్సాప్, ఫేస్‌బుక్ మానేయండి

SMTV Desk 2019-04-19 17:26:35  celphones, facebook,

"అమ్మాయిలు సెల్‌ఫోన్లు వాడకండి’" అంటూ ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్టణంలో అనూమానాస్పద స్థితిలో మృతి చెందిన జ్యోత్స్న కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. జ్యోత్స్న కేసులో విచారణ జరుగుతోందని.. ఇందులో నిందితులు ఎవరైనా వదిలేది లేదంటూ పేర్కొన్నారు. టెక్నాలజీతో జీవితాలు నాశనం అవుతున్నాయని తెలిపిన నన్నపనేని.. ‘‘అమ్మాయిలు సెల్‌ఫోన్లు, వాట్సాప్, ఫేస్‌బుక్ మానేయండి. అప్పుడే మీ జీవితాలు బాగుపడతాయి’’ అంటూ ఉచిత సలహాలు ఇచ్చారు. అంతటితో ఊరుకోక టీవీ సీరియల్స్ చూడటం ఆపేయండి అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ కామెంట్లపై పలువురు విమర్శలు కురిపిస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఒక మహిళ, అమ్మాయిల గురించి ఇలాంటి కామెంట్లు చేయడం దారుణం అంటూ అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు.