మహానాడు మహా పండుగ

SMTV Desk 2017-05-27 19:12:09  Andhra Pradesh,CM,Chadrababu Nayudu at mahanadu,TDP,NTR

విశాఖపట్నం, మే 26 : మహానాడు తెలుగు జాతి పండుగ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగు దేశం మహానాడు ప్రారంభోత్సవ వేడుకల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ అన్ని బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం మన నాయకుడు ఎన్.టి.రామారావు గారు స్థాపించిన పార్టీ, తెలుగు దేశం పార్టీ అన్నారు. హూద్ హూద్ తో దెబ్భ తిన్నవిశాఖ వాసులు పట్టుదలతో పోరాడి ఈ నగరాన్ని అందంగా తీర్చిదిద్దారని చెప్పారు. ఇప్పుడు అదే విశాఖపట్నంలో మహానాడు సభ ఏర్పాటు చేయడం దీనికి ఇంత మంది ప్రజలు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలుగు దేశం పార్టీ కాంగ్రెస్ తో 36 సంవత్సరాలుగా పోరాటం చేస్తోందని చెప్పారు. కార్యకర్తలు వారు చూపిన అభిమానం, కృషి, చేసిన త్యాగాలకు కృతఙ్ఞతలు తెలిపారు. తెలుగు దేశానికి ప్రపంచ స్థాయి గుర్తింపు రావడానికి కారణం కూడా కార్యకర్తలేనన్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడు మహానాడు నిర్వహించుకున్నా, మొన్న తెలంగాణలో తెలంగాణా తెలుగు దేశం మహానాడు నిర్వహించుకున్నా, ఇప్పుడు ఇక్కడ మహానాడు సభను నిర్వహించుకున్నా ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదని ఆనందం వ్యక్తం చేసారు. తెలంగాణలో తెలుగు దేశం మహా సభకు ఎంతో మంది హాజరవడానికి కారణం, ప్రజల కోసం మనం పని చేయడం వల్లే అని అన్నారు. వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినది తెలుగు దేశం పార్టి అన్నారు. ఇంకా మంచి మంచి కార్యక్రమాలతో ముందుకు వెళ్దాం అని చెప్పారు.